Home

»

Latest News

పన్ను పీకించుకున్న హీరో..

Sep 3, 2016 2:47PM

సినిమాల్లో చూపించినట్టు చాలామంది హీరోలు బయట కూడా బుద్ధిమంతులు కాదు. సినిమాల్లో ముందు బెంచిలో కూర్చోని టీచర్లు చెప్పింది విని మంచి స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నట్టు నిజజీవితంలో జరగదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ హీరో నాగశౌర్య..అతను హీరోగా నటించిన జ్యో అచ్చుతానంద త్వరలో రిలీజ్ కాబోతుండటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో తన వ్యక్తిగత విషయాలు పంచుకున్నాడు.

తనకు చదువు అస్సలు వంటబట్టేది కాదని..హోం వర్క్ చేయడం అంటే చాలా చిరాకు అని చెపుతూ దాన్ని తప్పించుకోవడానికి రకరకాల నాటకాలు ఆడేవాడినని వెల్లడించాడు. నన్ను హోంవర్క్ చేయమని అమ్మానాన్న నన్ను ఇంట్లో వదిలి బయటకు వెళ్లేవారు. కానీ, నేను ఆడుకునేవాడినంతే..వాళ్లు తిరిగొచ్చాకా హోంవర్క్ గురించి అడిగితే..కరెంట్‌పోయిందని చెప్పేవాడిని..అయితే కొన్నాళ్ల తర్వాత ఇంట్లో ఇన్వెర్టర్ బిగించడంతో ఆ అబద్ధం చెప్పడానికి లేకుండా పోయింది. ఆ సమయంలో చదువు తప్పించుకునేందుకు స్వయంగా ఓ పన్ను బలవంతంగా పీకేసుకున్నా..విపరీతమైన నొప్పి అనిపించినా చదివే పనిలేదు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే పన్ను తాలుకూ నొప్పి మాత్రం ఇంకా వేధిస్తోందని నాగశౌర్య అన్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com