Home

»

Latest News

ఆర్‌కె నాయుడు సిద్ధార్థ సెన్సార్ రిపోర్ట్

Sep 10, 2016 3:11PM

బుల్లితెరపై త‌న స్టామినాని నిరూపించుకుని వెండితెర ద‌శ‌గా అడుగులు వేస్తున్న  సాగ‌ర్  హీరోగా రామ దూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన  చిత్రం `సిద్ధార్థ‌`. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రూపొందింది.  దయానంద్ రెడ్డి దర్శకుడు. సాక్షి చౌద‌రి, రాగిణి నంద్వాని నాయిక‌లు. సెన్సార్ పూర్త‌యింది.

ఈ సందర్భంగా నిర్మాత‌ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ``మా `సిద్ధార్థ‌`కు సంబంధించి అన్ని ప‌నులూ పూర్త‌య్యాయి. సెన్సార్ స‌భ్యులు `ఎ` స‌ర్టిఫికెట్ ఇచ్చారు. మ‌లేషియా, హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో  చిత్రీక‌రించాం. నాలుగు పాట‌లున్నాయి. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన బాణీల‌కు ఇప్ప‌టికే చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఆయ‌న చేసిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ అవుతుంది. సాగ‌ర్  బుల్లితెర‌మీద ఎంత‌టి పేరు తెచ్చుకున్నాడో తెలిసిందే. `సిద్ధార్థ‌`లో ఆయ‌న చాలా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌ను ప్లే చేశారు.  ఈ సినిమాతో వెండితెర అభిమానులు కూడా ఆయ‌నికి అభిమానులుగా మారుతారు. ఎస్‌.గోపాల్‌రెడ్డిగారిలాంటి గొప్ప సాంకేతిక నిపుణులతో  ప‌నిచేయ‌డం మా అదృష్టం. వైవిధ్య‌మైన జోన‌ర్‌లో సాగే చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా ఆక‌ట్టుకుంటుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ఈ నెల 16న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం`` అని తెలిపారు. .

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com