Home

»

Latest News

రవితేజతో రేటు కుదరట్లేదా..?

Oct 20, 2016 6:10PM

తెలుగు చిత్ర సీమలో ఎనర్జిటిక్ యాక్టింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు మాస్ మహారాజ్ రవితేజ. తనదైన కామెడీ టైమింగ్‌తో,బాడీ లాంగ్వేజ్‌తో తెరపై నవ్వుల పువ్వులు పూయిస్తాడు రవితేజ. హీరోగా టర్న్‌ అయిన దగ్గర నుంచి ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదల చేస్తూ దూసుకెళ్లాడు. అలాంటిది కెరిర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు..కనీసం ఒక్క సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు. గతేడాది రవి నటించిన కిక్-2, బెంగాల్ టైగర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ తర్వాత ఏ సినిమాకు కమిటైనట్లు వార్తలు రాలేదు.

అయితే రవితో పవర్, పవన్‌తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు తీసిన యువ దర్శకుడు బాబీతో మాస్ మహారాజ్ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తుంది..రవితేజ అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వలేక నిర్మాతలు చేతులెత్తేయడంతో సినిమా సెట్స్ దాకా రాలేదట. అలాగే దిల్‌రాజుతో చేస్తాడనుకున్న సినిమా కూడా రెమ్యూనరేషన్ కారణంగానే మూలనపడిందట. మరి రవి నెక్స్ట్ మూవీ ఏంటో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com