Home  »  News  »  Mana shankara varaprasad garu: 25 రోజులకి గాను ఒరిజినల్ కలెక్షన్స్ ఇవే.. బుక్ మై షో నే సాక్ష్యం

Updated : Feb 5, 2026

 


-అభిమానులు ఇప్పుడు ఏమంటారో 
-తొలి తెలుగు చిత్రంగా నిలిచిందా!
-అసలు మొత్తం కలెక్షన్స్ ఎన్ని!
-ఓటిటి లోకి వస్తుందా
 


'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)తో చిరంజీవి(Chiranjeevi)తన సినీ కెరీర్ ని ఇప్పుడే స్టార్ట్ చేశాడా అనేలా  సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అంతలా యాక్టింగ్, డాన్స్, లుక్స్ తో రఫ్ఫాడించాడు. విక్టరీ వెంకటేష్ కూడా యాడ్ అవ్వడంతో హిట్ రేంజ్ కి సరికొత్త పదాలని కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులని ఫ్యామిలీ ప్రేక్షకుల్లా, ఫ్యామిలీ జోనర్ ని ఇష్టపడే ప్రేక్షకులని మాస్ ప్రేక్షకులుగా కూడా మార్చివేసిన ఘనత ని మన శంకర వర ప్రసాద్ అందుకున్నాడు. మరి వాళ్లందరూ ఇంతవరకు ఏ మేర కలెక్షన్స్ ని కట్టబెట్టారో చూద్దాం.


2026 సంక్రాంతికి పర్యాయపదంలా నిలబడాలనే ఉద్దేశ్యంతో  జనవరి 12 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన మన శంకర వరప్రసాద్ గారు నిన్నటితో పాతిక రోజులని పూర్తి చేసుకుంది. ఈ మేరకు సినీ ట్రేడ్ సర్కిల్స్ లో  375 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకున్నట్టుగా న్యూస్ వినపడుతుంది. మేకర్స్ సైతం సదరు ప్రకటనపై అధికార ప్రకటన ఇచ్చేసారు. కేవలం తెలుగు లాంగ్వేజ్ లోనే రిలీజ్ అయ్యి 375 కోట్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా కూడా మన శంకర వరప్రసాద్ నిలిచింది. ఫస్ట్ వీక్ నుంచే ఆ రికార్డుని తన పేరుపై ఉంచుకుంటు వస్తున్న విషయం తెలిసిందే. బుక్ మై షో లో ఇప్పటి వరకు 3 .6 మిలియన్ల టికెట్స్ సోల్డ్ అయ్యాయని సదరు యాప్ నిర్వాహకులు కూడా అధికారకంగా ప్రకటించారు.


Also read:  టైటిల్ మార్చాలని రోడ్డు ఎక్కిన బ్రాహ్మణులు.. అందుకు అలా చేస్తున్నారు

 

ఇక మన శంకర వర ప్రసాద్ గారు ఓటిటి లో ఎప్పుడు అడుగుపెడ్తాడని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలో స్ట్రీమింగ్ హక్కులని పొందిన  జీ 5 సంస్థ అధికారకంగా ప్రకటించకపోయినా తమ యాప్ వెబ్ సైట్ లో  ఈ నెల 11 న స్ట్రీమింగ్ కి సిద్ధం చేస్తున్నట్టుగా ఉంచింది. మరి త్వరలోనే ఓటిటి కి సంబంధించి అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.