
ఎస్‌ఎంఎస్ చిత్రంతో హీరోగా పరిచయమైన సుధీర్‌బాబు ఆ తర్వాత ఎన్నో విభిన్నమైన సినిమాల్లో నటించాడు. తను చేసే ప్రతి సినిమా కథ విభిన్నంగా ఉండాలని కోరుకునే సుధీర్ అలాంటి కథలతోనే సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. అలాంటి కథతోనే ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్, గ్లింప్స్‌ని విడుదల చేశారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మూడు క్యారెక్టర్లు చేయడం విశేషం.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. సూపర్‌స్టార్ మహేష్ ట్రైలర్‌ను విడుదల చేసి ‘ఈ ట్రైలర్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనిపిస్తోంది. సుధీర్‌బాబుకి, టీమ్‌కి ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. మామ, మేనల్లుడు మధ్య జరిగే ఒక రివెంజ్ డ్రామా స్టోరీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పలు టీవీ సీరియల్స్‌లో నటించడంతోపాటు సినిమాలకు రచయితగా పనిచేసిన హర్షవర్థన్ చాలా సినిమాల్లో వివిధ క్యారెక్టర్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈషా రెబ్బా, మిర్నాల్ని రవి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తుండగా అభినయ, హర్షవర్ధన్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు ముఖ్య ఇతర పాత్రలు పోషిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కాబోతోంది.