![]() |
![]() |

ప్రముఖ మలయాళం నటులు జి.కె. పిళ్లై శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరువనంతపురంలోని తన స్వస్థలం వర్కాలలో తుదిశ్వాస విడిచారు. పలువురు సినీ, టీవీ సెలబ్రిటీలు పిళ్లై మృతికి సోషల్ మీడియా ద్వారా సంతాపం ప్రకటించారు. అటు సినీ, ఇటు టీవీ రంగంలో పిళ్లై తనదైన ముద్ర వేశారు.
Also read: 'అర్జున ఫల్గుణ' మూవీ రివ్యూ
వర్కాలలో పుట్టి పెరిగిన పిళ్లై.. సినీ రంగంలో అడుగుపెట్టక ముందు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీలో సేవలు అందించారు. 'స్నేహసీమ' అనే చిత్రంతో మాలీవుడ్‌లో అడుగుపెట్టారు. యస్.యస్. రాజన్ డైరెక్ట్ చేసిన ఆ సినిమా 1954లో రిలీజయ్యింది. తచోళి ఆంబు, పలాట్టు కుంజికన్నన్, పదయోట్టమ్ వంటివి ఆయన నటించిన పాపులర్ ఫిలిమ్స్‌లో కొన్ని.
Also read: 'సేనాపతి' మూవీ రివ్యూ
1980ల వరకు సినిమాల్లో యాక్టివ్‌గా నటిస్తూ వచ్చిన పిళ్లై ఓ దశాబ్ద కాలం బ్రేక్ తీసుకున్నారు. తిరిగి 2000ల కాలంలో నటిస్తూ వస్తున్నారు. 2004లో 'కడమట్టాహు కథనార్' సీరియల్‌తో టీవీ రంగంలో కాలుపెట్టారు. ఇప్పటివరకూ ఆయన 325 సినిమాల్లో, పలు టీవీ సీరియల్స్‌లో నటించారు.
![]() |
![]() |