Home

»

Latest News

తారక్ ఔట్.. మహేశ్ ఇన్!

Feb 6, 2020 5:27PM

 

సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా పరిచయమవుతున్న 'ఓ పిట్ట కథ' టీజర్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 7) సాయంత్రం 5.05 గంటలకు సూపర్ స్టార్ మహేశ్ రిలీజ్ చేస్తారని ఆ చిత్ర నిర్మాణ సంస్థ భవ్యా క్రియేషన్స్ ప్రకటించింది. చెందు ముద్దు డైరెక్టర్‌గా పరిచయమవుతున్న ఈ సినిమాలో విశ్వంత్ దుద్దుంపూడి మరో హీరోగా నటిస్తున్నాడు. వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఒక ట్విస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేమంటే వాస్తవానికి ఫిబ్రవరి 7న ఈ సినిమా టీజర్‌ను జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాల్సి ఉంది. ఫిబ్రవరి 3న బ్రహ్మాజీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా చేసిన పోస్ట్ చూస్తే ఆ విషయమే తెలుస్తుంది. "ఓ పిట్ట కథ.. కానీ మా టీం ను 'బిగ్ స్టార్' ఆశీర్వదించబోతున్నారు' అని ఆయన ట్వీట్ చేశారు. దాంతో పాటు 'ఊహించండి' బ్లర్ చేసిన ఆ బిగ్ స్టార్ ఇమేజ్‌ను పోస్ట్ చేశాడు. అందులోని స్టార్ బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నట్లు, వెనుక ఓ కారు ఉన్నట్లు కనిపిస్తోంది. పరిశీలనగా చూస్తే అది జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ అని తెలిసిపోతుంది. తారక్ ఫ్యాన్స్ కూడా బ్లర్ చేసిన ఆ ఇమేజ్ ఒరిజినల్‌ను గుర్తించి, తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంస్ మీద షేర్ చేశారు. అయితే సీన్ కట్ చేస్తే.. తారక్ ప్లేస్‌లో మహేశ్ వచ్చాడు. దాంతో తారక్ ఫ్యాన్స్‌ను మహేశ్ ఫ్యాన్స్ ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు. తారక్ ఫ్యాన్స్‌కైతే ఈ మార్పు ఎందుకు జరిగిందో తెలీక అయోమయానికి గురయ్యారు. బ్రహ్మాజీని వారు ట్రోల్ చేస్తున్నారు. బ్రహ్మాజీకి కూడా ఈ మార్పు రుచించలేదో, ఏమో.. టీజర్‌ను మహేశ్ లాంచ్ చేస్తున్న విషయాన్ని ఇంతదాకా తన ట్విట్టర్ పేజీలో షేర్ చెయ్యలేదు. 

తెలుగుఒన్‌కు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్‌ను తారక్ రిలీజ్ చేయనున్నాడు. అందుకే టీజర్‌ను మహేశ్ చేత లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com