![]() |
![]() |

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా మెగా బ్లాక్ బస్టర్ 'మగధీర' రీ రిలీజ్ కానుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా 2009 జులై 30న తెలుగు సినీ రికార్డులను తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ ఏడాదితో 15 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరోసారి థియేటర్లలో అలరించనుంది.
రామ్ చరణ్ పుట్టినరోజు(మార్చి 27) సందర్భంగా ఒక రోజు ముందుగా మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా పంపిణీదారులు శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు మాట్లాడుతూ.. "ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నాం. మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారికి కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం" అన్నారు.
![]() |
![]() |