![]() |
![]() |

దుల్కర్ సల్మాన్(dulquer salmaan)మీనాక్షిచౌదరి(meenakshi chowdhary)హీరో,హీరోయిన్లుగా అక్టోబర్ 31 న దివాలి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ లక్కీ భాస్కర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ చిత్రానికి వెంకీ అట్లూరి(venki atluri)దర్శకుడు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ ని అందుకున్న ఈ మూవీ కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూళ్ళని అందుకుంది.ఇక అదే రోజు కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హీరోగా తెరకెక్కిన 'క'(ka)మూవీ కూడా విడుదలైన విషయం తెలిసిందే. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా ఒక రేంజ్ కలెక్షన్స్ నే సాధించింది.చింత గోపాల కృష్ణరెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీకి సుజీత్, సందీప్ లు దర్శకత్వం వహించగా నయన్ సారిక(nayan saarika)హీరోయిన్ గా చేసి ప్రేక్షకులని మెప్పించింది.
ఇప్పుడు ఈ రెండు మూవీలు ఓటిటి లో అడుగుపెట్టనున్నాయి. ఈ మేరకు ఆయా సంస్థల నుంచి అధికార ప్రకటన కూడా వచ్చింది. లక్కీ భాస్కర్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 28న విడుదల అవుతుండగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాకుంది. 'క' మూవీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీన ఈటీవీ విన్ ద్వారా తెలుగు లాంగ్వేజ్ వరకు మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. రిలీజ్ టైం లో థియేటర్స్ లో పోటీని ఎదుర్కున్న ఈ రెండు సినిమాలు, ఇప్పుడు ఓటిటి వేదికగా కూడా ఒకే రోజు తలపడనున్నాయి. మరి రెండు విభిన్నమైన పాయింట్స్ తో తెరకెక్కిన ఈ రెండు సినిమాల్లో ఓటిటి ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఎక్కువగా ఆదరిస్తారో చూడాలి.
![]() |
![]() |