ఒక సినిమా ప్రారంభించి దాని షూటింగ్ సక్సెస్‌ఫుల్ పూర్తి చేయాలంటే ఎన్నో అడ్డంకులు, అనుకోని అవాంతరాలు రావచ్చు. వాటన్నింటినీ అధిగమించి షూటింగ్ పూర్తి చేసిన తర్వాత అంతకు మించిన టాస్క్ ఆ సినిమాను రిలీజ్ చెయ్యడం. ఒక సినిమా రిలీజ్ అవ్వడం అంటే అంత మామూలు విషయం కాదు. మార్కెటింగ్ పరంగా, బిజినెస్‌పరంగా ఎన్నో లెక్కలు ఉంటాయి. అందర్నీ సంతృఫ్తి పరచిన తర్వాతే ఆ సినిమా రిలీజ్‌కి నోచుకుంటుంది. కొన్ని సినిమాలు ఇలాంటి విషయాల్లోనే ఆగిపోతాయి.
ఇప్పుడు అలాంటి విచిత్రమైన పరిస్థితి దళపతి విజయ్ సినిమా ‘లియో’కి వచ్చింది. టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘లియో’ అక్టోబర్ 19న విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. డిఫరెంట్ పోస్టర్లను రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. ఇదిలా ఉంటే ఒక షాకింగ్ న్యూస్ అభిమానుల్ని కలవరపరుస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల అయోమయంలో పడిరది. ఈ సినిమా హిందీ వెర్షన్ అదేరోజు రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. దీంతో బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన మొదలైంది. హిందీ వెర్షన్ రిలీజ్‌కి ఓటీటీ అగ్రిమెంట్ అడ్డుపడుతోంది.
హిందీలో ఏ సినిమా రిలీజ్ అయినా 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ రిలీజ్ చేసుకోవాలనే అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని పివిఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి సంస్థలు ఫాలో అవుతున్నాయి. ‘లియో’ విషయానికి వస్తే 4 వారాల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేసుకునే విధంగా అగ్రిమెంట్ చేశారని సమాచారం. దీంతో ఈ సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ విషయంలో గందరగోళం నెలకొంది. సౌత్ సినిమాలకు హిందీలో మంచి మార్కెట్ ఉందన్న విషయం తెలిసిందే. కమల్‌హాసన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘విక్రమ్’కు రూ.20 కోట్లు వచ్చినట్లు వచ్చిందట. ఆ రికార్డుని అధిగమించాలని ‘లియో’ మేకర్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు సినిమా రిలీజ్ సస్పెన్స్‌లో పడిరది. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాలి.
Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...‘లియో’ విడుదలపై గందరగోళం.. టెన్షన్‌లో మేకర్స్!
Sep 22, 2023 3:32PM
Customer Service
For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com





