![]() |
![]() |

-వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీతో దూసుకుపోతున్న లెనిన్
-మూడు రోజులకి అరుదైన రికార్డు
-కలెక్షన్స్ పై పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద లెనిన్ తన హవాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. తెల్లవారు జాము నాలుగు గంటల ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు. మూవీ లవర్స్ థియేటర్స్ కి పోటెత్తుతున్నారు.రిలీజైన అన్ని చోట్ల ఇదే పరిస్థితి. దీంతో అఖిల్ కెరీర్ లో లెనిన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో పాటు సరికొత్త కలెక్షన్స్ నమోదవుతున్నాయి.
లెనిన్ మొదటి రోజు 16 .7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు 21 కోట్ల రూపాయిల పై చిలుకు గ్రాస్ తో 37 .2 కోట్లు రాబట్టింది. ఇక మూడోరోజైన ఆదివారం నాడు ఏకంగా వరల్డ్ వైడ్ గా 24 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో టోటల్ గా మూడు రోజులకి 61 .1 గ్రాస్ తో దూసుకుపోతున్నాడు. మేకర్స్ కూడా ఈ కలెక్షన్స్ వివరాలని అధికారంగా ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నెలకొని ఉంది.
Also read: మా మధ్య గొడవలు పెట్టారు.. ఇప్పుడు వాళ్ళ కళ్ళు చల్లబడతాయి
ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, 'లెనిన్' ఇదే స్పీడ్ ని కొనసాగిస్తూ ఉంటే మరో రెండు రోజుల్లోనే వంద కోట్ల మార్కుని అందుకోవడం ఖాయమని, దీంతో ముందు ముందు లెనిన్ కలెక్షన్స్ స్పీడ్ ఊహకందని విధంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న కలెక్షన్స్ రిపోర్ట్ కూడా ట్రేడ్ వర్గాల అంచనాలకి బలాన్ని ఇస్తున్నాయి.

![]() |
![]() |