Home  »  News  »  Lenin: చరణ్ కి రంగస్థలం, అఖిల్ కి లెనిన్!.. ఫ్యాన్స్ సంబరాలు 

Updated : Jul 10, 2026

 

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని క్యారెక్టరైజేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన మైలురాయి చిత్రం 'రంగస్థలం'. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)పోషించిన 'చిట్టిబాబు' రోల్  తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 1980ల నాటి పల్లెటూరి వాతావరణంలో, వినికిడి లోపం ఉన్న ఒక సాధారణ యువకుడిగా చరణ్ చూపించిన నటన ఊహాతీతం. సుకుమార్ దర్శకత్వంలో 2018 లో వచ్చి  బాక్సాఫీస్ వద్ద దాదాపు 216 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం వసూళ్లే కాదు, ఒక కమర్షియల్ హీరో తన ఇమేజ్ పక్కన పెట్టి ఇలాంటి క్యారక్టర్ చేయగలడా అని అందరూ ముక్కున వేలేసుకునేలా చరణ్ నటన సాగింది. చరణ్ నటుడిగా వంద శాతం పరిపూర్ణత సాధించాడనే ప్రశంసలు దక్కాయి.

ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni)లెనిన్(Lenin)కి రంగస్థలానికి మూవీ లవర్స్ పోలికలు తెస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు స్పందిస్తూ 'అఖిల్ మొదటి చిత్రం నుంచి అన్ని సినిమాలు చూస్తూ ఉన్నాం. ఆ చిత్రాల్లో లేని ఒక మెస్మరైజ్  లెనిన్ ద్వారా అఖిల్ లో చూసాం. గ్రామీణ యువకుడిగా రంగస్థలంలో చరణ్ ఎలా అయితే అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించాడో, అఖిల్ కూడా లెనిన్ లో అంతే కనిపించాడు. క్యారక్టర్ డిజైన్ పరంగా రెండు చిత్రాల్లోని క్యారెక్టర్స్ తమ గుండెల్లో మండుతున్న పగ యొక్క అగ్నిజ్వాలాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలి. అప్పడే కథ యొక్క తీవ్రత ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్తుంది. ఆ తీవ్రతని చరణ్, అఖిల్ పర్ఫెక్ట్ గా పండించారని, చిట్టిబాబు రోల్  ఎలాగైతే చరణ్ కెరీర్ కి టర్నింగ్ గా నిలిచిందో, అఖిల్ కెరీర్‌ లెనిన్ తో మలుపు తిరిగినట్టే అని కామెంట్స్ చేస్తున్నారు. 

Also read: Lenin: హమ్మయ్య గండం దాటారు.. ఎవర్రా ఐరెన్ లెగ్!


స్టిల్ లెనిన్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రివ్యూస్ కూడా ప్యూర్ పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెనిన్ సాధించే ఫస్ట్ డే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.