![]() |
![]() |

విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ఆవిష్కరించారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఇండియన్-2' షూటింగ్ కోసం కమల్ విజయవాడ వచ్చారు. ఈ క్రమంలో గురునానక్ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని శుక్రవారం ఉదయం ఆయన ఆవిష్కరించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో దేవినేని అవినాష్ తో పాటు కృష్ణ, మహేష్ బాబు అభిమానులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు.

తన తండ్రి కృష్ణ విగ్రహాన్ని కమల్ హాసన్ ఆవిష్కరించడం పట్ల మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. "విజయవాడలో కృష్ణగారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనందుకు కమల్ హాసన్ గారికి, దేవినేని అవినాష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం నిజంగా గర్వకారణం, ఆయన వదిలి వెళ్లిన వారసత్వానికి నివాళులు. అలాగే, ఈ ఈవెంట్‌ను సాధ్యం చేసిన అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు." అని మహేష్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
![]() |
![]() |