![]() |
![]() |

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన 'అఖిల్' ఇప్పటివరకు హీరోగా మూడు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.. కానీ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. దీంతో అఖిల్ తొలి విజయాన్ని ఎప్పుడు అందుకుంటాడా అని అక్కినేని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అఖిల్ 'బొమ్మరిల్లు భాస్కర్' దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా చేస్తున్నాడు. డైరెక్టర్ భాస్కర్ సైతం కొంతకాలంగా ప్లాపుల్లో ఉండటంతో.. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదనే చెప్పాలి. అలాగే అఖిల్ 'సురేందర్ రెడ్డి' దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఏజెంట్' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇదిలాఉంటే అఖిల్ తన ఆరవ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అఖిల్ కి ఎలాగైనా మంచి విజయాన్ని అందించాలన్న ఉద్దేశంతో.. అఖిల్ ఆరవ సినిమాకు కొరటాల శివను రంగంలోకి దించేందుకు కింగ్ నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో 'ఆచార్య' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ పట్టాలెక్కించబోతున్నాడు. అనంతరం అఖిల్ తో సినిమాను స్టార్ట్ చేసేందుకు స్క్రిప్టు సిద్దం అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరి మొదటి మూడు సినిమాలతో విజయాన్ని అందుకోలేకపోయిన అఖిల్.. తరువాతి మూడు సినిమాలతోనైనా విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |