![]() |
![]() |

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ప్రొడక్షన్ నెం 7గా గీతా ఆర్ట్స్ 2 నిర్మిస్తున్న ఈ సినిమా కిరణ్ అబ్బవరంకు కూడా 7వ సినిమా కావడం గమనార్హం. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు.

అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణుకథ' అనే ఆసక్తికర టైటిల్ ను పెట్టారు. మురళి కిషోర్ అబ్బూరు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా టైటిల్ లాగానే టైటిల్ ని ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ కూడా ఆసక్తికరంగా ఉంది. పోస్టర్ లో పల్లె వాతావరణం, గుడి, నాయకుడి కటౌట్, కుక్క పిల్ల వంటివి కనిపిస్తున్నాయి. 'రాజావారు రాణివారు', 'SR కళ్యాణ మండపం' వంటి గ్రామీణ నేపథ్యమున్న సినిమాలతో మెప్పించిన కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతోనూ ఆకట్టుకుంటాడేమో చూడాలి.

'వినరో భాగ్యము విష్ణుకథ' మూవీ పూజా కార్యక్రమాలతో శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అన్విత క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ కిషోర్ తిరుమల మూవీ టీమ్ కి స్క్రిప్ట్ అందించారు.
కిరణ్ అబ్బవరం చేతిలో 'సెబాస్టియన్', 'సమ్మతమే' తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా గీతా ఆర్ట్స్ లో నటించే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
![]() |
![]() |