![]() |
![]() |

సూపర్ స్టార్ మహేష్ బాబు(mohan babu)కొరటాల శివ(koratala siva)కాంబోలో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన హిందీ భామ కియారా అద్వానీ.ఆ తర్వాత రామ్ చరణ్(ram charan)తో 'వినయ విధేయ రామ' లో జోడి కట్టింది.ఇప్పుడు మళ్ళీ చరణ్ తోనే 'గేమ్ చేంజర్' లో జత కడుతున్న కియారా లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
అందులో ఆమె మాట్లాడుతు మూడు సంవత్సరాల నుంచి 'గేమ్ చేంజర్'(game changer)షూటింగ్ జరుగుతుంది.ఈ ముడేళ్ళల్లో నేను నటించిన ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. కానీ 'గేమ్ చేంజర్' నాకెంతో ప్రత్యేకం.ఎందుకంటే ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే నేను వివాహ బంధంలోకి అడుగుపెట్టాను. అందుకే ఈ చిత్రం నాకు వృత్తి పరంగానే కాకుండా వ్యక్తి గతంగా కూడా ప్రత్యేకమైనది.ఎంతో మంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేసారు.చరణ్,శంకర్(shankar)సర్, తమన్ లతో పని చెయ్యడం చాలా ఆనందం ఉంది.సిల్వర్ స్క్రీన్ పై గేమ్ చేంజర్ అడుగుపెట్టే రోజు కోసం మా టీం తో పాటు నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని చెప్పుకొచ్చింది.

ఇక గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పది న విడుదలవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 21 న యుఎస్ లోని టెక్సాస్ లో జరగబోతుంది. ఎస్ జె సూర్య, శ్రీకాంత్,అంజలి, సునీల్, సముద్ర ఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండగా దిల్ రాజు(dil raju)తన ఎంటైర్ కెరిరీలోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.
![]() |
![]() |