Home

»

Latest News

చిరుని ఎట‌కారం చేసిన ఆ నోళ్లు ఏమ‌య్యాయి?

Jan 21, 2017 10:06AM

చిరంజీవి సినిమాల్లోకి మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అన‌గానే.. అభిమానులంతా సంబ‌రాలు చేసుకొన్నారు. అయితే కొంత‌మంది మాత్రం పెద‌వి విరిచారు. చిరు రీ ఎంట్రీ వ‌ల్ల ఒరిగేదేం ఉండ‌ద‌ని విశ్లేష‌ణ‌లు ఇచ్చారు. పొలిటిక‌ల్‌గా చిరు అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యాడ‌ని, ఆ డామేజీ సినిమాల‌కూ పాకుతుంద‌ని, చిరు ఇప్పుడు సినిమాలు చేసినా జ‌నం చూడ‌ర‌ని ద‌మ్మున్న ఛాన‌ల్ అని చెప్పుకొనే ఓ మీడియా సంస్థ బోలెడ‌న్ని క‌థ‌నాలు ప్ర‌చురించింది. అంతేనా??  ఆ ఛాన‌ల్‌కి సినీ పెద్ద‌లు ఎవ‌రైనా వ‌స్తే... `చిరు రీ ఎంట్రీ వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని అంద‌రూ అనుకొంటున్నారు, మీ ఉద్దేశం ఏమిటి` అనే ప్ర‌శ్న ప‌దే ప‌దే గుచ్చి అడ‌గ‌డం క‌నిపించింది. ఇప్పుడు చిరు రీ ఎంట్రీ ఇచ్చేశాడు. బాస్ దెబ్బ‌కు బాక్సులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి.

అతి త‌క్కువ రోజుల్లోనే వంద కోట్లు సాధించిన టాలీవుడ్ చిత్రంగా రికార్డులకెక్కింది ఖైదీ . మ‌రి ఇప్పుడు ఆ ఛాన‌ల్ ఏమంటుంది?  చిరు రీ ఎంట్రీ చేసినా జ‌నం చూడ‌రని ఎద్దేవా చేసిన ఆ సినీ ప్ర‌ముఖులు ఏమంటారు?  అంతెందుకు... గౌత‌మి పుత్ర ప‌క్క‌న ఖైదీ నెం.150  కొట్టుకెళ్లిపోతుంద‌ని జోస్యం చెప్పిన రాంగోపాల్ వ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కూ పెద‌వి విప్ప‌లేదే??  చిరు వ‌సూళ్ల ప్ర‌భంజ‌నం చూసి క‌ళ్లు బైర్లుక‌మ్మాయా??   విమ‌ర్శ‌కుల‌కు చిరు త‌న స్టామినా చూపించే స‌మాధానం చెప్పాడు.  బాక్సాఫీసుకి తానే కింగ్ అని నిరూపించాడు. తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర‌వాత కూడా, పొలిటిక‌ల్‌గా ఫ్లాప్ అయిన త‌ర‌వాత కూడా చిరుని చూడ్డానికి జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారంటే.. ఖచ్చితంగా చిరు మానియా అంత‌లా నాటుకుపోయింది. అందుకే బాక్సాఫీసుకి మా బాసేకింగ్‌... అని ఆయ‌న అభిమానులు ఇప్పుడు కాల‌ర్ ఎగ‌రేస్తున్నారు.  ద‌టీజ్ చిరు..!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com