![]() |
![]() |
.webp)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరు సంపాదించిన నటుడు రాకింగ్ రాకేష్(rocking rakesh)పలు సినిమాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించిన రాకేష్ రీసెంట్ గా 'కేసిఆర్'(kcr)అలియాస్ 'కేశవ చంద్ర రమావత్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.నవంబర్ 22 న థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ మూవీకి గరుడవేగ అంజి(garuduvega anji)దర్శకత్వం వహించగా రాకేష్ నే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు.
ఇప్పుడు 'కేసిఆర్' మూవీ ఈ నెల 28 నుంచి ఓటిటి వేదికగా 'ఆహా' లో స్ట్రీమింగ్ కానుంది.ఈ విషయాన్నీ చిత్ర బృందం అధికారకంగా చెప్పడమే కాకుండా సరికొత్త ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది.టైటిల్ రోల్ లో రాకేష్ నటించగా అనన్య కృష్ణన్ హీరోయిన్ గా,తనికెళ్ళ భరణి,ధనరాజ్,లోహిత్ కుమార్,జోర్దార్ సుజాత,రచ్చరవి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.చరణ్ అర్జున్ సంగీత దర్శకుడు కాగా మధు ఎడిటర్ గా వ్యవహరించాడు.
![]() |
![]() |