![]() |
![]() |

నిన్న రాత్రి హైదరాబాద్(Hyderabad)శివారులోని ఒక రిసార్ట్ లో ప్రముఖ సినీ గాయని'మంగ్లీ'(Mangli)బర్త్ డే పార్టీ వేడుకలు జరిగాయి. ఇందులో కొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళల్లో పలువురు సినీ ప్రముఖులు ఉన్నారని, ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్(Kasarla Shyam)కూడా ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. ఇప్పడు ఆ వార్తలపై కాసర్ల శ్యామ్ స్పందించడం జరిగింది.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతు 'మంగ్లీ బర్త్ డే పార్టీకి నేను హాజరయ్యాను. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసేవరకు ఉన్నాను. ఆ తర్వాత అక్కడ్నుంచి వచ్చేశాను. నాకు డ్రగ్స్ అలవాటు లేదు. వాటి గురించి కూడా తెలియదు. అలాంటి వాటికి నేను దూరం. అనవసరంగా తప్పుడు ప్రచారాలు చేయవద్దని చెప్పుకొచ్చాడు.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన 'అల వైకుంఠపురం' మూవీలోని 'రాములో రాములో'అనే ఫోక్ సాంగ్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన గేయ రచయిత కాసర్ల శ్యామ్. గత సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ వన్ మాన్ షో 'డాకుమహారాజ్' లోని 'దబిడి దబిడి సాంగ్' కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇలా సుదీర్ఘ కాలం నుంచి ఎన్నో అద్భుతమైన పాటలని అందిస్తు తెలుగు పాటల పూదోటలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు.
![]() |
![]() |