![]() |
![]() |

బాలీవుడ్ అగ్ర హీరోయిన్ లో ఒకరైన దీపికా పదుకునే(Deepika Padukone)సుదీర్ఘ కాలం నుంచి తన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తుంది. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee Kumar)కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం దీపికా వీడీయో ఒకదాన్ని రిలీజ్ చేసింది. సదరు వీడియోలో ఉన్న దాన్ని బట్టి దీపికా క్యారక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో కూడా అర్ధమవుతుంది. ఇక కొన్నిరోజుల క్రితం ఒక భారీ ప్రాజెక్టు నుంచి మేకర్స్ దీపికాని తప్పించారని, ఆమె డిమాండ్ చేసిన ఇరవై ఐదుకోట్ల భారీ పారితోషకంతో పాటు వర్కింగ్ అవర్స్ అందుకు కారణమనే వార్తలు వచ్చాయి.
ఇప్పుడు వీటిపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు 'కబీర్ ఖాన్'(Kabir Khan)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'మిగతా రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో వారికి కూడా వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. వర్కింగ్ అవర్స్ లో దీపికా చేసిన డిమాండ్ న్యాయమే. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఎనిమిది గంటల షిప్ట్ లో పని చేస్తారు. అలాంటిది దీపికాని ఈ విషయంలో ఎందుకు తప్పుగా అనుకుంటున్నారో తెలియదు. ఒప్పుకోక పోవడానికి కూడా దర్శకులకి సరైన కారణం ఉండాలి. ప్రేక్షకాదరణ ఉన్న నటీనటులు ఎవరైనా తగిన పారితోషకం కోరడానికి అర్హులు. నేను సుమారు ఐదు వందల మంది సిబ్బందితో కలిసి పని చేస్తాను. సినిమా రంగంలోని వారు షూటింగ్ ల కోసం వ్యక్తిగత జీవితాల్ని త్యాగం చెయ్యాలనే విషయాన్నీ నేను అంగీకరించను. పన్నెండు గంటలకి మించి నేనెప్పు డు షూటింగ్ చెయ్యలేదు. ఆదివారాల్లోను చిత్రీకరణ చెయ్యలేదని కబీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ లో ఉన్న ప్రముఖ అగ్ర దర్శకుల్లో కబీర్ ఖాన్ ఒకడు. 2006 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన' కాబూల్ ఎక్స్ ప్రెస్' తో దర్శకుడుగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి 'ఏక్తా టైగర్, భజరంగీ బాయ్ జాన్, 'చందు ఛాంపియన్' వంటి సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించాడు. నిర్మాతగాను చిత్రాలు నిర్మించిన కబీర్ ఖాన్ ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిం సారధ్యంలో 'తారిఖ్' అనే మూవీ చేస్తున్నాడు.

![]() |
![]() |