![]() |
![]() |

దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చరిత్ర పురుషుడు కొమరం భీమ్ గా నటిస్తుండగా.. అతనికి మార్గదర్శి తరహా పాత్రలో దర్శనమివ్వనున్నారు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్. విజయదశమి కానుకగా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ పిరియడ్ డ్రామా విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. 'ఆర్ఆర్ఆర్'లో కలిసి నటిస్తున్న ఈ ఇద్దరు మేటి నటులు.. ఆ మూవీ రిలీజైన ఆరు నెలల తరువాత ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటాపోటీగా నిలవనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే.. అజయ్ దేవగణ్ స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం 'మే డే'. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి అజయ్ నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ఏప్రిల్ 29న జనం ముందుకు రానుంది.
కట్ చేస్తే.. సరిగ్గా అదే రోజున 'ఎన్టీఆర్ 30' కూడా రాబోతోంది. `జనతా గ్యారేజ్` వంటి సెన్సేషనల్ హిట్ తరువాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించనున్న ఈ సినిమా.. ఏప్రిల్ 29న పాన్ - ఇండియా ప్రాజెక్ట్‌గా హిందీతో సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. మొత్తమ్మీద.. అక్టోబర్ 13న కలిసి సందడి చేయనున్న తారక్, దేవగణ్.. ఏప్రిల్ 29న పోటీగా వేసవి బరిలోకి దిగుతున్నారన్నమాట. మరి.. ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి.
![]() |
![]() |