Home  »  News  »  Vijay: అదంతా పక్కా ఫేక్.. మరి అంత హడావిడి చేసారుగా

Updated : Jul 7, 2026

 

ఇళయదళపతి విజయ్(Vijay) వన్ మాన్ షో 'జన నాయగన్' (Jana Nayagan) చుట్టూ జరుగుతున్న హైప్, వివాదాలు రోజురోజుకూ సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విజయ్ అభిమానులు మాత్రం జన నాయగన్ ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో అడుగుపెడుతుందా అనే అతృతతో ఎదురుచూస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా జన నాయగన్  సెన్సార్ రిపోర్ట్ మరియు విడుదల తేదీపై అనేక రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం రోజున 'జన నాయగన్' చిత్రానికి సెన్సార్ బోర్డు 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చిందంటూ ఒక సెన్సార్ సర్టిఫికేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. సుమారు 3 గంటల రన్‌టైమ్‌తో కూడిన ఈ నకిలీ పత్రంలో డైలాగ్స్ మ్యూట్ చేయడం, హింసను తగ్గించడం వంటి మార్పులను కూడా ప్రస్తావించారు.

అయితే, ఈ సెన్సార్ సర్టిఫికేట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే అసలు నిజం బయటపడింది. కొందరు నెటిజన్లు ఆ సర్టిఫికేట్‌ను నిశితంగా పరిశీలించగా, అది గతంలో విజయ్ నటించిన 'లియో' (Leo) సినిమా ఒరిజినల్ సెన్సార్ సర్టిఫికేట్‌ని  ఎడిట్ చేసి సృష్టించిన నకిలీ (ఫేక్) పత్రమని తేలింది. ఈ తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మరియు బిజినెస్ హెడ్ సుప్రీత్ మోహన్ తక్షణమే స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న సదరు సెన్సార్ సర్టిఫికేట్ పూర్తిగా నకిలీది.సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఇటీవల తాజా సమీక్షని పూర్తి చేసింది. అందులో భాగంగా కొన్ని తుది సవరణల (Final Revisions) జాబితాని  పంపింది. ఆ సవరణలన్నీ పూర్తి చేసి బోర్డుకు సమర్పించిన తర్వాతే అధికారికంగా సెన్సార్ సర్టిఫికేట్ జారీ అవుతుంది. బోర్డు సూచించిన తుది మార్పులను వేగంగా పూర్తి చేస్తున్నాం. అన్ని అనుకూలిస్తే జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Also read: Anirudh vs sai abhayankar: అనిరుధ్ వర్సెస్ సాయి అభయంకర్.. బాగుపడేది మాత్రం వాళ్ళే 

vijay, kvn productions, h vinoth






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.