![]() |
![]() |
సినిమాల్లో వచ్చే కొన్ని సీన్స్ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, కొన్ని డైలాగులు కావచ్చు...ఇలా ఒకటేమిటి రకరకాల కారణాలతో ఆయా సినిమాలపై కేసులు పెడుతుంటారు. ఇలాంటి వివాదాలు ఎప్పుడు, ఎలా వస్తాయో ఎవ్వరూ చెప్పలేరు. కొన్ని సీన్స్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు, తను రాసుకున్న కథని కాపీ కొట్టి సినిమా తీశారని ఒకరు.. ఇలాంటివన్నీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. తాజాగా అలాంటి వివాదమే రజనీకాంత్ సినిమా ‘జైలర్’ విషయంలో వచ్చింది. ఈ సినిమాలో ఐపిఎల్ క్రికెట్ టీమ్ ఆర్‌సిబికి చెందిన జెర్సీని ఒక కిల్లర్ వేసుకుంటాడని, దానివల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఆర్‌సిబి టీమ్ కోర్టుకెక్కింది. ఆర్‌సిబి జెర్సీని వారు అవమానించారని, సినిమా నుంచి ఆ సీన్‌ను డిలీట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు తన తీర్పును వెలువరించింది. ఆర్‌సిబి పేర్కొన్న సీన్‌ను ‘జైలర్’ సినిమాలో తొలగించాలని నిర్మాతలను ఆదేశించింది హైకోర్టు.
![]() |
![]() |