![]() |
![]() |

అంగ్రేజ్ మీడియం మూవీ ప్రమోషన్స్ సమయంలో ఇర్ఫాన్ ఎమోషనల్ అయ్యారు. 'నాకు ఈ సినిమా ఎంతో ముఖ్యం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలిసి ఈ సినిమాను ప్రమోట్ చేద్దాం అనుకున్నా. కానీ నా శరీరంలో ఎంతో మంది అనవసరపు అతిథులు ఉన్నారు. అందుకే మిమ్మల్ని కలుసుకోలేకపోతున్నాను. ఈ సినిమా మిమ్మల్ని నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. మళ్లీ నవ్విస్తుంది. ఇంకా ఎన్నెన్నో విషయాలు బోధిస్తుంది. ట్రైలర్‌ను ఎంజాయ్ చేయండి. నా కోసం ఎదురుచూడండి' అని ట్వీట్ చేశారు.
క్యాన్సర్ బారిని పడినా ఇర్ఫాన్ ఖాన్ అంతకుముందు అగ్రిమెంట్ ప్రకారం అంగ్రేజ్ మీడియం షూటింగ్లో పాల్గొన్నాడు. అయితే ఇమ్రాన్ ఖాన్ వీలును చూసుకుని ఎటువంటి ఇబ్బంధి కలగకుండానే చిత్రాన్ని పూర్తి చేశారు. విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్నా.. లాక్ డౌన్ వల్ల థియేటర్ల నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
![]() |
![]() |