![]() |
![]() |
.jpg)
"మన గతాన్ని బంధించేవి జ్ఞాపకాలు. ఆ గతంలో మనల్ని బంధించేవి గాయాలు.." అంటూ మొదలవుతుంది 'మిస్టర్ కాసనోవా' మూవీ. ఇది డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర అసోసియేట్‌గా పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి రూపొందించిన ఇండిపెండెంట్ ఫిల్మ్. టైటిల్స్‌తో కలిపి 49 నిమిషాల నిడివి ఉన్న ఈ ఫిల్మ్ ఇప్పుడు తెలుగు వన్ యూట్యూబ్ చానల్‌లో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. వరుణ్ అనే గిటారిస్ట్ గోవాలో గడిపిన నాటి జ్ఞాపకాలు, అప్పడు అతడెదుర్కొన్న ఘటనల తాలుకు గాయాల సమాహారం ఈ చిత్రం.
లాక్‌డౌన్ టైమ్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ కనువిందు చేస్తోంది. టెక్నికల్‌గా ఉన్నత స్థాయిలో ఉండే ఫీచర్ ఫిల్మ్ తరహాలో ఉన్న ఈ మూవీలోని క్వాలిటీ టెక్నికల్ వాల్యూస్ చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు. ముందుగా మన కంటికి నచ్చేది పవన్‌కుమార్ పుప్పాల సినిమాటోగ్రఫీ. సూపర్బ్ విజువల్స్‌తో అతను ఆకట్టుకున్నాడు. గోవా అందాలను చాలా బాగా చూపించాడు. కాలిఫోర్నియా నుంచి గోవాకు వచ్చిన తార అనే ట్రావెల్ బ్లాగర్‌తో వరుణ్ పరిచయం క్రమంగా మంచం పంచుకొనే దాకా రావడం, తర్వాత ఇద్దరూ గొడవతో విడిపోవడం.. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రేవంత్‌రెడ్డి మలిచాడు. ఫ్యూచర్ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ కావడానికి కావాల్సిన స్టఫ్ తన దగ్గర ఉందని, తను న్యూ ఏజ్ డైరెక్టర్‌నని 'మిస్టర్ కాసనోవా'తో అతను తెలియజేశాడు.
వరుణ్‌గా భార్గవ్, హీరోయిన్ తారగా తేజస్వి సింగ్ అహ్లావత్, రియా అనే మరో కీలక పాత్రలో దేవియాని శర్మ నటించిన ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్‌కు సహ రచయిత పవన్‌కుమార్ పిళ్లారిశెట్టి. మ్యూజిక్‌తో పాటు లిరిక్స్‌ను కూడా పెద్దపల్లి రోహిత్ సమకూర్చగా, నాని దేవరపల్లి ఆర్ట్ వర్క్ అందించాడు. అయిల శ్రీనివాసరావు ఎడిటర్‌గా పనిచేశాడు. రవితేజ గన్ని నిర్మించిన ఈ మూవీకి పటోల్ శ్రీనివాస్ సహ నిర్మాత. డైరెక్షన్‌తో పాటు ఈ ఫిల్మ్‌కు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని కూడా రేవంత్‌రెడ్డి అందించాడు.
![]() |
![]() |