![]() |
![]() |
అందం, అభినయం కలగలిసిన హీరోయిన్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడుతుంది. ఒక హీరోయిన్ నెక్స్‌ట్ సినిమా ఏం చేస్తుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలుగుతోందంటే ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అలాంటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హనీ రోజ్. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో హీరోయిన్‌గా మెరిసిన హనీ.. ఇప్పుడు యూత్‌కి ఎట్రాక్షన్‌గా మారింది. నిజానికి 2008లోనే శివాజీ హీరోగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ఆలయం’ చిత్రంలో హనీ హీరోయిన్‌గా నటించింది. అయితే అప్పుడు ఆమెకు అంత గుర్తింపు రాలేదు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘ఈ వర్షం సాక్షిగా’ చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించింది. అయినా ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పుడు వీరసింహారెడ్డి పుణ్యమా అని ఇప్పటికి క్రేజ్ వచ్చింది. ఆమెను హీరోయిన్‌గా బుక్ చేసుకునేందుకు చాలా మంది దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. హనీరోజ్ ఓ స్పెషల్ సాంగ్‌లో అందాలు ఆరబోయనుందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పైగా ఆ స్పెషల్ సాంగ్ కోసం కోటి రూపాయలు హనీ డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. విశ్వక్‌సేన్ హీరోగా కృష్ణచైతన్య దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ చిత్రంలో ఒక మంచి ఊపున్న స్పెషల్ సాంగ్ కోసం హనీరోజ్‌ను సంప్రదించారని, కోటి రూపాయలు రెమ్యునరేషన్ ఇస్తే తాను చేయడానికి సిద్ధమేనని హనీరోజ్ చెప్పిందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
![]() |
![]() |