![]() |
![]() |
కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన మెహరీన్ మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్2, ఎంత మంచివాడవురా, ఎఫ్3, జవాన్.. ఇలా పదికి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మెహరీన్ కెరీర్ సడన్‌గా నెమ్మదించింది. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందుతున్న ‘స్పార్క్’ చిత్రంలో నటిస్తోంది. కన్నడలో ఓ సినిమా చేస్తున్నప్పటికీ అది ఎప్పటికి పూర్తవుతుందో తెలీని పరిస్థితి. మెహరీన్‌తో సినిమాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వెబ్ సిరీస్ వైపు దృష్టి మళ్ళించిందామె. ‘సుల్తాన్ ఆఫ్ ఢల్లీి’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో చేసింది. దీనిలో మెహరీన్ క్యారెక్టర్‌కు అంత ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపించలేదు. అయితే సినిమాలో ఆమె చేసిన హాట్ సీన్స్ మాత్రం బాగానే ఉన్నాయని అందరూ అంటున్నారు. అందులో కొన్ని సీన్స్ కాస్త శృతి మించినట్టుగానే కనిపిస్తున్నాయి. దీంతో మెహరీన్ అంటే ఇష్టపడే నెటిజన్లు అలాంటి సీన్స్‌లో చేస్తావా అని ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్స్ రోజురోజుకీ పెరిగిపోతుండడంతో ఆమె మనస్తాపం చెందినట్టుంది. అందుకే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.
కొన్ని కథల్లో సిట్యుయేషన్‌ని బట్టి కొన్ని సీన్స్ చేయాల్సి వస్తుందని, నేను చేసే పనికి న్యాయం చెయ్యాలి కాబట్టి వారు చెప్పినట్టు నేను చేస్తాను అంటోంది. నటన అనేది ఒక కళ అని, తనకి ఆ కళ అంటే ఎంతో ఇష్టమని పేర్కొంది. సుల్తాన్ ఆఫ్ ఢల్లీిలో భయానకంతో కూడిన వైవాహిక అత్యాచారాన్ని చిత్రీకరించే సన్నివేశం ఉంది. చాలా మంది శృంగార సన్నివేశంగా అభివర్ణించడం నాకు బాధ కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దాన్ని ఈ వెబ్ సిరీస్‌లో చూపిస్తే ఆ ఒక్క సీన్‌ని పట్టుకొని సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యడం సరికాదు. ఇలా ట్రోల్ చేస్తున్న వాళ్ళకి కూడా సోదరీమణులు, కుమార్తెలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళు తమ జీవితంలో ఇటువంటి బాధను అనుభవించకూడదని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. మహాలక్ష్మి, సంజన, హనీ.. ఇలా ఏది చేసినా నా ప్రేక్షకుల ఆనందం కోసమే. నటిగా ప్రతి పాత్రకు న్యాయం చెయ్యాలని, నా సత్తా చూపించాలని కోరుకుంటున్నాను అని చెప్పింది.
![]() |
![]() |