Home

»

Latest News

ఆత్మహత్యకు ముందు ఉదయ్ ఎవర్ని కలిశాడు

Oct 24, 2016 11:33AM

చిత్రం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమై లవర్‌బాయ్‌గా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు ఉదయ్‌కిరణ్. వరుస బ్లాక్ బస్టర్లతో అనతికాలంలోనే స్టార్‌హీరోగా ఎదిగాడు. కానీ అంతలోనే వరుస ఎదురుదెబ్బలు పలకరించడంతో తట్టుకోలేక అర్థాంతరంగా తనువు చాలించాడు. అప్పుడే ఉదయ్ చనిపోయి మూడు సంవత్సరాలు గడచిపోయింది. తాజాగా ఉదయ్ కిరణ్ గురించి ఆయన మిత్రుడు హీరో అల్లరి నరేష్ ఒక సంచలన విషయం చెప్పాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు తనను ఉదయ్ కిరణ్ కలిశాడట. ఆ  సమయంలో ఉదయ్ ముఖంలో దిగులు, బాధ  కనిపించాయట.

ఏమైందని అడిగితే ..పొద్దునే పేపర్లో వచ్చిన ఆర్టికల్‌లో ఒక యువ కథానాయకుడు కథలు సరిగా ఎంచుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడట. దీనిపై స్పందించిన నరేష్..దానికే అంత బాధపడాలా..? నీకు సంబంధించిన విషయం కాదు కదా అని అడగ్గా..దానికి ఆ అర్టికల్ వేరే హీరోకు సంబంధించిందే అయినా..అతడు స్టోరీ సెలక్షన్‌లో మార్పు రాకపోతే అతడికి కూడా ఉదయ్‌కు పట్టిన గతే పడుతుందని తనను ఉదాహరణగా చెప్పారు అని బాధపడ్డాడట. అసలే బాధలో ఉన్న ఉదయ్‌కు ఆ ఆర్టికల్ తీవ్ర మనస్తాపాన్ని కలిగించిందని..ఆత్మహత్యకు ఇది కూడా ఒక కారణం కావొచ్చునని అంటున్నాడు నరేష్.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com