![]() |
![]() |

చాలా కాలం తర్వాత మహేష్ బాబు చేస్తున్న పూర్తి మాస్ సినిమా 'గుంటూరు కారం'. ఈ సినిమాతో ఆయన అసలుసిసలు మాస్ చూపించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఈ మూవీ పోస్టర్లు చూస్తే మాత్రం "ఈ బీడీ ఫాంటసీ ఏంటయ్యా నీకు" అనిపిస్తుంది.
'అతడు', 'ఖలేజా' తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి విడుదలవుతున్న దాదాపు అన్ని పోస్టర్లలో మహేష్ బీడీ తాగుతూ కనిపిస్తున్నాడు. మిర్చి యార్డ్ లో బీడీ తాగుతూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ పోస్టర్ ని ఫస్ట్ లుక్ గా విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అప్పటి నుంచి విడుదలవుతున్న దాదాపు అన్ని పోస్టర్స్ లో మహేష్ బీడీ కాలుస్తూ కనిపిస్తున్నాడు. రీసెంట్ గా "దం మసాలా" సాంగ్ అప్డేట్ ఇస్తూ విడుదల చేసిన పోస్టర్స్ లో కూడా మహేష్ బీడీతోనే దర్శనమిచ్చాడు. ఈ సాంగ్ ప్రోమో తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ నవంబర్ 7న విడుదల కానుంది.
తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
![]() |
![]() |