![]() |
![]() |

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందుతోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం ఖాయమని అందరూ బలంగా నమ్ముతున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 22 కి వాయిదా పడింది. దీంతో ఆ సమయంలో విడుదల ప్లాన్ చేసుకున్న 'హాయ్ నాన్న', 'సైంధవ్', 'ఎక్స్ట్రా - ఆర్డినరీ మ్యాన్' సినిమాల విడుదల తేదీలు మారిపోయాయి. 'సలార్'కి సైడ్ ఇస్తూ ఇలా పలు సినిమాలు తప్పుకుంటుండగా.. యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం తన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో 'సలార్'ని ఢీ కొడతానంటున్నాడు.
విశ్వక్ సేన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీని మార్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. డిసెంబర్ 23న విడుదల చేయాలని చూస్తున్నారట. అంటే 'సలార్' విడుదలైన మరోసారి రోజే 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థియేటర్లలోకి అడుగు పెట్టనుంది అన్నమాట. అదే నిజమైతే ఇది పెద్ద సాహసమనే చెప్పాలి. మరి 'సలార్' ప్రభంజనం ముందు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. మరోవైపు డిసెంబర్ 23 కుదరని పక్షంలో డిసెంబర్ 29వ తేదీని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
![]() |
![]() |