![]() |
![]() |
అదేమిటి? కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అంటాం, చిన్న పిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు అందరూ చూసే సినిమా అంటాం. ఇదేంటి చిన్న పిల్లలతో కలిసి చూడొద్దంటున్నారు. అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. ఈ సినిమాను చిన్న పిల్లలతో కలిసి చూడకండి. అలాగే సున్నిత మనస్కులు ఈ వయొలెన్స్‌ని చూసి తట్టుకోలేరని హెచ్చరిస్తున్నాడు హీరో జయం రవి.
విషయం ఏమిటంటే... జయం రవి హీరోగా తమిళ్‌లో రూపొందిన ‘ఇరైవన్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్’ పేరుతో అనువదించారు. ఈ సినిమాని సెప్టెంబర్ 28న తెలుగులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. రాహుల్ బోస్ సైకో కిల్లర్‌గా నటించిన ఈ హారర్ సస్పెన్స్ మూవీలో విజువల్స్ చాలా దారుణంగా ఉంటాయని జయం రవి మాటలని బట్టి అర్థమవుతోంది. మరో విశేషం ఏమిటంటే జయం రవికి తెలుగులో అంత ఫాలోయింగ్ లేకపోవడంతో ఈ సినిమాని నయనతార సినిమాగానే నిర్మాతలు ప్రమోట్ చేస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 28న పెద్ద సినిమాల రిలీజ్‌లు ఉన్నాయి. వాటి మధ్యలో నయనతార సినిమా ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.
![]() |
![]() |