Home

»

Latest News

అప్పుడే ధృవపై డౌటా..?

Dec 8, 2016 3:31PM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ ధృవ రిలీజ్‌కు రెడీ అయ్యింది..రేపు వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా ధియేటర్లలోకి రానున్నాడు ధృవ. చాలా రోజుల తర్వాత చెర్రి మూవీ రిలీజవుతుండటంతో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో బెనిఫిట్ షోలు ఏర్పాటు చేసుకున్నారు అభిమానులు. ఇప్పుడు వారందరికి షాకిచ్చింది చిత్రయూనిట్. అర్థరాత్రి నుంచి తెల్లవారుజామున ప్రదర్శించబడే ధృవ బెనిఫిట్ షోలను రద్దు చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

దీని వెనుక పెద్ద కారణమే ఉంది..అప్పట్లో శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన బ్రూస్‌లీని బెనిఫిట్ షోల రూపంలో ఒకరోజు ముందేచూశారు జనం. కానీ ఆ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను అలరించకపోవడంతో డివైడ్ టాక్ వ్యాపించి డిజాస్టరయ్యింది. దీనిని దృష్టిలో ఉంచుకున్న నిర్మాతలు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికే బెనిఫిట్ షోలు రద్దు చేసి ఉంటారని ఫిల్మ్‌‌నగర్ సర్కిల్స్‌లో గుసగుసలాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి..ధృవ ఫస్ట్ కాపీ చూసిన దర్శకనిర్మాతలకు సినిమాలో పస లేదని అర్థమైపోయిందట. ఫస్టాఫ్ అదిరిపోయినప్పటికి..సెకండాఫ్‌ సో..సోగా ఉందట..అందుకే కనీసం పెట్టుబడి అయినా వెనక్కి తెచ్చుకోవడానికి చర్యలు ప్రారంభించారట.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com