![]() |
![]() |

బిగ్ బాస్ 4 సీజన్ మొదటివారంలో డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట్ అయ్యారు. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మరో కంటెస్టెంట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన ఆ కంటెస్టెంట్ సాయికుమార్ పంపన. మారుతి సినిమాల్లో కమెడియన్‌గా అతను పేరు తెచ్చుకున్నాడు. 'ఈరోజుల్లో ' అనే సినిమా ద్వారా కమెడియన్ గా పరిచయం అయ్యి బాగా పాపులర్ అయ్యాడు. తాను మూడు ఆశలతో బిగ్ హౌస్ లోకి వెళ్లుతున్నానని సాయి చెప్పాడు.
"బిగ్ బాస్ లో విజయం సాధించడం లేదా కరోనాకు వ్యాక్సిన్ వచ్చి బయట వాతావరణం అంతా మాములుగా కావడం, బిగ్ బాస్ షో తర్వాత నా స్క్రిప్ట్ విని మీరు అవకాశం ఇవ్వడం. ఈ మూడింటిలో ఏదీ జరిగినా నేను ఈ షో ద్వారా విజయం సాధించినట్లే" అని చెప్పాడు. "సరే మంచిది, మమ్మల్ని సినిమాలో ఎలా నవ్వించావో.. వాళ్ళను అలాగే నవ్వించు "అంటూ కుమార్ సాయిని నాగార్జున హౌస్ లోకి పంపించారు. సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో మెల్లగా పిల్లిగా హౌస్ లో అడుగుపెట్టిన కుమార్ సాయిని చూపించారు.
ఈసారి బిగ్ బాస్ హౌస్ లో ఆశించిన స్థాయిలో పెద్ద సెలెబ్రిటీలు గానీ, కమెడియన్స్ కానీ లేకపోవడంతో అనుకున్నంత స్థాయిలో హుషారు లేదనే చెప్పవచ్చు. ఆ ప్లేసును భర్తీ చేసేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయిని హౌస్ లోకి పంపినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఆశించినట్లు.. బిగ్ బాస్ హౌస్ లో కుమార్ సాయి నవ్వులు పూయిస్తాడా లేక నవ్వులపాలు అవుతాడా అనేది బిగ్ బాస్ హౌస్ లోనే తెలుస్తుంది.
![]() |
![]() |