![]() |
![]() |

ఇప్పుడంటే ఓటీటీల పుణ్యమా అని ఎన్నో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. కానీ అప్పట్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ప్రముఖ టీవీ సిరీస్ 'సీఐడీ'నే. ఇండియాలో ఎక్కువకాలం ప్రసారమైన టీవీ సిరీస్ గా రికార్డు క్రియేట్ చేసింది. అంతలా ఆదరణ పొందిన సీఐడీ టీవీ సిరీస్ ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. ఇందులో నటించిన ప్రముఖ నటుడు దినేష్ ఫడ్నిస్(57) కన్నుమూశారు.
సీఐడీలో ఇన్స్పెక్టర్ ఫ్రెడరిక్స్ గా 20 ఏళ్లకు పైగా ప్రేక్షకులను అలరించారు దినేష్ ఫడ్నిస్. తనదైన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న దినేష్.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లివర్ సంబంధిత సమస్యలతో పాటు గుండెపోటు రావడంతో ఆయనను ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న దినేష్.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
![]() |
![]() |