![]() |
![]() |
.jpg)
మార్చి 27 రామ్‌చరణ్ పుట్టినరోజు. గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈ రోజుని కోవిడ్-19 భయాందోళనల మధ్య సాధారణంగా జరుపుకున్నాడు చరణ్. ఫ్యాన్స్‌ని కూడా ఎలాంటి ఆర్భాటాలూ చేయవద్దనీ, తన పుట్టినరోజును సెలబ్రేట్ చేయవద్దనీ ముందుగానే సూచించాడు. కాగా మార్చి 27న చరణ్ పుట్టడానికి తనకు ఏం కారణం కనిపించిందో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
కొడుకుకు ట్విట్టర్ వేదికగా బర్త్‌డే విషెస్ చెప్పిన ఆయన, రామ్‌చరణ్ పుట్టినప్పుడు సహజంగానే నేను అమితానందం పొందాను. ఆ తర్వాత చాలా రోజులకు నాకు స్ఫురించింది.. బహుశా మార్చి 27న అతడు పుట్టడానికి ఒక కారణం ఉందని. ఆ రోజు ప్రపంచ రంగస్థల దినోత్సవం (వరల్డ్ థియేటర్ డే). నీటిలో చేపలాగా అతను నటనను చేపట్టాడు. ఈ సందర్భంగా చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. దాంతో పాటు చరణ్ పసివాడిగా ఉన్నప్పటి ఒక ఫొటోను ఆయన షేర్ చేశాడు. ఆ ఫొటోలో చిరంజీవి కింద పడుకొని, నిల్చొని ఉన్న చరణ్‌కు నిక్కరు తొడుగుతున్నారు.
ఈ పోస్ట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. తండ్రి పోస్ట్‌కు చరణ్ కూడా స్పందించాడు.


![]() |
![]() |