![]() |
![]() |

కరోనాపై పోరాటానికి భారతీయులంతా సంఘీభావం ప్రకటించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన 'దియా జలావో' పిలుపుకు టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందించారు. ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు మోదీ చెప్పినట్లుగా 9 నిమిషాల పాటు ఇళ్లల్లోని లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తులు వెలిగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్ తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో వీడియో సందేశం ద్వారా ఈ విషయం తెలిపారు. "మన గౌరవ భారత ప్రధాని మోడీ గారి పిలుపు మేరకు రేపు ఆదివారం రాత్రి సరిగ్గా 9 గంటలకు 9 నిమిషాల పాటు మనందరం మన కుటుంబసభ్యులతో కలిసి మన ఇంటి ఆరుబయటకు వచ్చి, కొవ్వొత్తులు కానీ, సెల్‌ఫోన్ ఫ్లాష్‌లు కానీ, టార్చిలైట్లు కానీ వెలిగించి సంఘీభావాన్ని తెలుపుదాం. కరోనాను తుదముట్టించడానికి భారతీయులందరూ ఒక్కటయ్యారు అనే సందేశాన్ని ప్రపంచదేశాలకు చాటిచెప్పుదాం. రండి.. భారత ప్రధాని పిలుపుకు స్పందించండి. కరోనాను అంతమొందించండి. అందరూ ఒక్కటై వెలుగులు నింపండి అని చిరంజీవి" పిలుపునిచ్చారు.
రామ్‌చరణ్, "రేపు రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మన ఇళ్లల్లో ఉన్న లైట్లన్నీ ఆర్పేసి దీపాలు వెలిగిద్దాం. మన ప్రధానమంత్రి గారి మాట పాటిద్దాం. కరోనా లేని భారతాన్ని కచ్చితంగా సాధిద్దాం" అని చెప్పారు.
![]() |
![]() |