Home  »  News  »  Chiranjeevi: వయసు 70 , ఫ్యాషన్ మాత్రం 25 ..హ్యాట్సాఫ్ చిరు 

Updated : Jul 9, 2026

 


తెలుగు సినిమా రంగంలో 'చిరంజీవి'(Chiranjeevi)అనే పేరుకి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఎన్ని దశాబ్దాలు దాటుతున్న అదే క్రేజ్. 70 ఏళ్ళ వయసులో కూడా యంగ్ హీరోలకి పోటీ ఇస్తున్నారు. పోటీ ఇవ్వడమే కాదు.. వాళ్ళని బీట్ చేసి తనని క్రాస్ చేయలేని విధంగా దూసుకుపోతున్నాడు. ప్రీవియస్ హిట్ మన శంకర వరప్రసాద్ గారునే ఉదాహరణ. ప్రస్తుతం బాబీ కొల్లి దర్సకత్వంలో తన 158 వ చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ సెట్‌లో చిరంజీవి చూపిస్తున్న నెక్స్ట్ లెవెల్ ఎనర్జీ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమాకి  సంబంధించిన రెండవ షెడ్యూల్ హైదరాబాద్‌లో అత్యంత వేగంగా, శరవేగంతో జరుగుతోంది. ఈ  సరికొత్త షెడ్యూల్‌లో ఒక భారీ, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్స్‌  ప్లాన్ చేశారు. ఇక్కడే మెగాస్టార్ తన అసలైన విశ్వరూపాన్ని చూపిస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్ రామ్, లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో ఈ ఫైట్ సీన్‌ డిజైన్ చేశారు. ఈ భారీ వింటేజ్ యాక్షన్ ఎపిసోడ్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఒక రోమాంచితమైన వర్షం బ్యాక్‌డ్రాప్ (Rain Action Scene) లో సాగే ఫైట్. కండలు తిరిగిన యువకులే చలిలో, వర్షంలో గంటల తరబడి ఫైట్లు చేయడానికి వెనకాడుతుంటారు. అలాంటిది 70 ఏళ్ల వయసులో చిరంజీవి ఏమాత్రం డూప్ లేకుండా, స్వయంగా తానే రంగంలోకి దిగి ఈ రిస్కీ స్టంట్లను పూర్తి చేస్తుండటం విశేషం.

ఈ వర్షం ఫైట్ సీన్ కోసం చిరంజీవి గంటల తరబడి తడుస్తూ, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో శత్రువులను చీల్చిచెండాడుతున్న తీరు చూసి సెట్స్‌లోని యూనిట్ సభ్యులంతా రోమాంచితం అయ్యారు. ఈ వయసులోనూ ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం, కష్టపడే తత్వం చూసి ప్రతి ఒక్కరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు 'ది బ్లేడ్ దట్ సెట్ ది బ్లడీ బెంచ్‌మార్క్' అనే పవర్‌ఫుల్ టాగ్‌లైన్ పెట్టారు. దానికి తగ్గట్టుగానే చిరంజీవి పాత్ర చాలా రౌద్రంగా, వైల్డ్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సినిమా కోసం చిరంజీవి పడ్డ ఫిజికల్ మేకోవర్ శ్రమ కూడా సామాన్యమైనది కాదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు మెగాస్టార్ జిమ్‌లో గంటల తరబడి చెమటోడుస్తూ కఠినమైన వర్కవుట్లు చేశారు. ఆ 60 సెకన్ల జిమ్ వీడియో సోషల్ మీడియాలో విడుదలైనప్పుడు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండ్ అయింది.


Also read: Pawan kalyan: రేపు ముంబైకి పవన్ కళ్యాణ్.. ఎన్నో రోజులు ఉంటారంటే

గతంలో చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండవ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తెగా నటిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే 'జైలర్', 'డాకు మహారాజ్' వంటి చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన విజయ్ కార్తీక్ కన్నన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. సాంకేతికంగానూ ఎక్కడా రాజీ పడకుండా విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని, గుండెల్లో ప్యాషన్ ఉంటే ఎంతటి రికార్డులనైనా తిరగరాయవచ్చని మెగాస్టార్ చిరంజీవి మరోసారి నిరూపిస్తున్నారు. థియేటర్లలో ఈ వర్షం ఫైట్ సీన్ చూస్తున్నప్పుడు అభిమానులకి  పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. 

chiranjeevi, bobby, mega 158






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.