Home

»

Latest News

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పై కేసు నమోదు..ఇది ఎవరి పని!

May 15, 2025 4:07PM

వివి వినాయక్(VVvinayak)దర్శకత్వంలో వచ్చిన అల్లుడు శ్రీను ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai srinivas) అనతికాలంలోనే ప్రేక్షకుల్లో తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. జయజనకినాయక, రాక్షసుడు, అల్లుడు అదుర్స్, స్పీడున్నోడు, సీత, కవచం వంటి పలు విభిన్న చిత్రాల్లో నటిస్తు తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.

రీసెంట్ గా సాయి శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ ఉన్న తన నివాసానికి వెళ్లే సమయంలో తన కారుని అపసవ్య దిశలో నడిపినట్టుగా పోలీసులు గుర్తించి ప్రశ్నించడం జరిగింది. కానీ తనని అడ్డుకున్న ట్రాఫిక్ పోలీసుతో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్(JUbilee Hills)పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ పై కేసు నమోదయ్యింది.

ప్రస్తుతం సాయి శ్రీనివాస్  మే 30 నరిలీజ్ కాబోతున్న తన కొత్త మూవీ 'భైరవం'కి సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్(Manchu Manoj) నారారోహిత్(Naara Rohith)కూడా నటించడం జరిగింది . సత్య సాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ భైరవాన్ని నిర్మించగా విజయ్ కనకమేడల(VIjay Kanakamedala) దర్శకత్వం వహించాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com