![]() |
![]() |

ఈ దసరాకు నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ బరిలోకి దిగనున్నారు. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'భగవంత్ కేసరి' అక్టోబర్ 19న విడుదల కానుండగా, రవితేజ హీరోగా వంశీ డైరెక్షన్ లో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు' అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ రెండు సినిమాల్లో నిడివి పరంగా 'భగవంత్ కేసరి' కంటే 'టైగర్ నాగేశ్వరరావు' ఎక్కువ కావడం విశేషం.
'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలు ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాయి. 'భగవంత్ కేసరి' నిడివి 2 గంటల 35 నిమిషాలు కాగా, 'టైగర్ నాగేశ్వరరావు' నిడివి 3 గంటల 2 నిమిషాలు. ఈ రెండు సినిమాల పైనా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన రెండు సినిమాల ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలకు రెండున్నర గంటల నిడివి అనేది కరెక్ట్ టైం. నిడివి పెరిగే కొద్దీ ఏమాత్రం తేడా కొట్టినా ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశముంది. ఆ పరంగా చూస్తే 'భగవంత్ కేసరి'కి ప్లస్. అయితే 3 గంటలకు పైగా నిడివితోనూ సరైన కంటెంట్ తో హిట్ కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి 'టైగర్ నాగేశ్వరరావు' కూడా ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.
![]() |
![]() |