![]() |
![]() |

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ శాసనసభ్యులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, నటసింహ నందమూరి బాలకృష్ణ రూ. 1.25 కోట్లు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. అందులో రూ. 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహాయనిధికి, రూ. 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా షూటింగ్‌లు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం రూ. 25 లక్షల చెక్‌ను కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి. కల్యాణ్‌కు అందించారు. కరోనాపై పోరాటానికి తన వంతు బాధ్యతగా రూ. 1 కోటి 25 లక్షలు విరాళంగా అందిస్తున్నానని బాలకృష్ణ తెలిపారు. స్వీయ కట్టడితో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలనీ, కరోనా వైరస్‌ని అరికట్టడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

![]() |
![]() |