![]() |
![]() |

అష్షురెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక సంచలనమే. జూనియర్ సమంతగా పేరు తెచ్చుకుంది. ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి బిగ్ బాస్ కి వెళ్ళింది. ఇక హౌస్ నుంచి వచ్చాక సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేసింది. రీసెంట్ గా రిలీజ్ ఐన ఆర్జీవీ మూవీకి వెరైటీగా ప్రొమోషన్స్ కూడా చేసింది. వర్మని ఇంటర్వ్యూ చేసి పాపులర్ ఐన వారిలో అష్షు కూడా ఒకటి.
ఇక ఇప్పుడు ఈమె కొత్తగా ఒక మూవీ ఛాన్స్ ని కూడా అందుకుంది. టాలీవుడ్ యంగ్ హీరో అరవింద్ కృష్ణ నటిస్తున్న "ఏ మాస్టర్ పీస్" మూవీలో హీరోయిన్ పాత్రలో ఈమె కనిపించబోతోంది. ఈ సినిమాకు సుకు పూర్వజ్ డైరెక్టర్ కాగా కండ్రగుల శ్రీకాంత్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ మూవీలో అష్షు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
![]() |
![]() |