![]() |
![]() |

మలయాళంలోని కొన్ని సినిమాలు తెలుగులో మంచి హిట్ అందుకున్నాయి. ఎందుకంటే కొన్ని కథల్లో స్పై ఎలిమెంట్స్ తో పాటు, థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ సరిగ్గా ఉండటంతో ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అవుతున్నారు.
మలయాళం అనగానే మమ్ముట్టి, మోహన్ లాల్ అందరికి గుర్తొస్తారు. అయితే ' 2018 ' సినిమాతో అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన హీరో టోవినో థామస్ తక్కువ మందికి తెలుసు. అయితే ఇతని కథల ఎంపిక భిన్నంగా ఉంటుంది. గత నెల ఫిబ్రవరి నెలలో మలయాళంలో రిలీజ్ అయిన థ్రిల్లర్ 'అన్వేషిప్పిన్ కండేతుమ్'. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. నిజ జీవిత సంఘటనలతో 90's బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ సినిమాని చిత్రీకరించారంట. అయితే ఈ సినిమాలోని కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులని ఎక్కువగా ఆకట్టుకున్నాయంట.
మార్చి 8 నుండి ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమాని స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారంట. మరి తాజాగా మమ్ముట్టి నటించిన మూవీ ' భ్రమయుగం'.. మొదట ఓటీటీలో రిలీజ్ చేస్తామని అనగా... ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాని కూడా అదే రకంగా రిలీజ్ చేస్తారా లేక డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తారా చూడాలి మరి.
![]() |
![]() |