![]() |
![]() |
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి నేషనల్ అవార్డులు కూడా రావడంతో ఇప్పుడు ‘పుష్ప2’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ధీటుగా ఈ చిత్రాన్ని రూపొందించే పనిలో ఉన్నాడు సుకుమార్. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి కొన్ని భారీ షెడ్యూల్స్ జరిగాయి. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కోసం ఎక్కువ సమయం తీసుకుంటుండడం వల్ల డిలే అవుతోంది. ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తయింది.
తాజా సమాచారం మేరకు నవంబర్ 2 నుంచి ‘పుష్ప2’ భారీ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం కాబోతోంది. ఈ షెడ్యూల్లో పెద్ద జాతర ఫైట్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ ఫైట్ ముందు వచ్చే సీన్స్‌ని కూడా చిత్రీకరిస్తారట. అలాగే ఒక పాటను కూడా ఈ షెడ్యూల్‌లోనే షూట్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమా మొత్తానికి ఇదే భారీ షెడ్యూల్ అని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లో అల్లు అర్జున్ తిరుపతి గంగమ్మ జాతరకి సంబంధించిన వేషంలో కనిపించి మెప్పించారు. కాగా ఇప్పుడు జాతర ఫైట్ అనడంతో అల్లు అర్జున్ ఈ ఫైట్ కోసం అదే గెటప్‌లో కనిపించొచ్చు అనుకుంటున్నారు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ పెళ్ళిలో ఉన్న బన్ని ఈరోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని, రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.
![]() |
![]() |