![]() |
![]() |

'అర్జున్ రెడ్డి' చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ విభిన్న పాత్రలు పోషిస్తూ వరుస సినిమాలతో అలరిస్తున్నాడు. 'భరత్ అనే నేను', 'గీతగోవిందం', 'హుషారు', 'జాతిరత్నాలు' వంటి చిత్రాలు ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రపంచస్థాయిలో ఎన్నో పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలోనూ కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ని పంచుకున్నాడు.
రాహుల్ రామకృష్ణ తండ్రి అయ్యాడు. సంక్రాంతి పండగ నాడు ఆయనకు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని ఆయన 'బాయ్.. సంక్రాంతి రిలీజ్' అంటూ కాస్త భిన్నంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ముఖం కనపడనివ్వకుండా తన కుమారుడి ఫోటోని కూడా షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు.
ఇదిలా ఉంటే రాహుల్ రామకృష్ణ గతేడాది మే నెలలో తనకు కాబోయే భార్యను ముద్దాడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు తాజాగా 'సంక్రాంతి రిలీజ్' అంటూ కొడుకు పుట్టాడని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
![]() |
![]() |