Home

»

Latest News

ప్రభాస్ 'కల్కి'పై 'కేజీఎఫ్' స్టార్ యశ్ కామెంట్స్!

Jun 28, 2024 6:08PM

ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'కల్కి 2898 AD' (Kalki 2898 AD) చిత్రం జూన్ 27న థియేటర్లలో అడుగుపెట్టింది. పాజిటివ్ టాక్ తో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.190 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి 'కేజీఎఫ్' స్టార్ యశ్ (Yash) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విజువల్ వండర్ ని సృష్టించిన 'కల్కి 2898 AD' టీంకి అభినందనలు అంటూ యశ్ ట్వీట్ చేశాడు. "ఈ చిత్రం క్రియేటివ్ స్టోరీ టెల్లింగ్ కి మార్గం సుగమం చేస్తుంది. నాగ్ అశ్విన్, వైజయంతీ మూవీస్ యొక్క విజన్, ధైర్యం.. మరిన్ని భారీ చిత్రాలు తీయడానికి ప్రేరణగా నిలుస్తాయి. డార్లింగ్ ప్రభాస్, అమితాబ్ గారు, కమల్ హాసన్ గారు, దీపికా పదుకొనే, అలాగే కొన్ని సర్ప్రైజ్ క్యామియోలు.. ఇలా అందరూ అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ని అందించారు. ఇలాంటి అద్భుతమైన సినిమాని తీసుకొచ్చేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను." అంటూ యశ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com