![]() |
![]() |

దర్శక ధీరుడు రాజమౌళి, మాస్ మహారాజా రవితేజ కాంబోలో 2006 లో వచ్చిన మూవీ విక్రమార్కుడు. అప్పటివరకు వచ్చిన రవితేజ, జక్కన్న మూవీల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. డ్యూటీ కోసం ప్రాణాలని సైతం ఇచ్చే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ గా, దొంగతనాలు చేసుకునే అత్తిలి సత్తిబాబు గా రవితేజ నట విధ్వంసానికి ఆల్ థియేటర్స్ జింతాక్ అయ్యాయి. పైగా ఆ ఇద్దరి అభిమానులకి ఫేవరేట్ మూవీ కూడా ఇదే. ఇంతటి ఘన కీర్తి ఉన్న విక్రమార్కుడు గురించి ఒక నిర్మాత చెప్పిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ప్రముఖ నిర్మాత కేకే రాధా మోహన్ నిర్మాణంలో విక్రమార్కుడు 2 ఉందనే వార్తలు ఎప్పటినుంచో వస్తున్నాయి. గోపిచంద్ భీమాకి ఈయననే నిర్మాత. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతు విక్రమార్కుడు 2 కథ సిద్ధంగా ఉందని రవితేజ గారు మాత్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపాడు. కానీ రవితేజ గారు పార్ట్ 2 పై అంతగా ఆసక్తిగా లేరని కూడా చెప్పాడు. విక్రమార్కుడు పేరుని ఎక్కడ చెడగొడతామో అనే భయం ఆయనలో ఉందనే కారణాన్ని కూడా చెప్పాడు. కానీ తనని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నామని విజయేంద్ర ప్రసాద్ గారే కథ ని అందిస్తున్నారని తెలిపాడు.

సంపత్ నంది డైరెక్ట్ చేస్తాడని కూడా రాధామోహన్ చెప్పాడు. ఫైనల్ గా చెప్పాలంటే నేను సిద్ధంగా ఉన్నానని రవితేజ గారు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు మూవీ ప్రారంభం అవుతుందని తెలిపాడు. ఆల్రెడీ విక్రమార్కుడు 2 టైటిల్ రిజిస్టర్ కూడా చేయించానని చెప్పాడు. ఇప్పడు అయన చెప్పిన ఈ న్యూస్ తో రవితేజ,జక్కన్నల ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విక్రమార్కుడు 2 స్టార్ట్ అవుతుందా అని అనుకుంటున్నారు. ఇంకొంత మంది అయితే జక్కన్న నే ఆ మూవీ డైరెక్ట్ చెయ్యాలని ఆశపడుతున్నారు.
![]() |
![]() |