![]() |
![]() |

సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తమన్నా రూమర్డ్ లవర్ విజయ్ వర్మ విలన్‌గా నటిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది. సూర్యతో పాటు దుల్కర్ కూడా ఈ సినిమాలో కీ రోల్ చేస్తున్నారు. హిందీ సినిమా యాక్టర్ విజయ్ వర్మని ఈ సినిమాలో విలన్‌గా తీసుకున్నారు. డార్లింగ్స్, దాహద్, పింక్, గల్లీ బోయ్, సూర్ 30, లస్ట్ స్టోరీస్2 అంటూ పలు రకాల ప్రాజెక్టులతో తనను తాను ప్రూవ్ చేసుకున్నారు విజయ్ వర్మ. ఒకప్పుడు నార్త్ ఆడియన్స్ కి మాత్రమే తెలిసిన విజయ్ వర్మ గురించి ఇప్పుడు సౌత్ ఆడియన్స్ కూడా ఇంట్రస్టింగ్‌గా తెలుసుకుంటున్నారు. అందులోనూ తమన్నా ప్రియుడుగా ఇప్పుడు ఆయన మరింత పాపులర్ అయిపోయారు. అందులోనూ ప్యాన్ ఇండియా సినిమాలను రూపొందిస్తున్న డైరక్టర్లు, తాము రాసుకున్న పాత్రలకు రకరకాల భాషల నుంచి నటీనటులను సెలక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సుధా కొంగర కూడా ఆ కోవలోనే విజయ్ వర్మను సెలక్ట్ చేసుకున్నారని టాక్.
విజయ్ కేరక్టర్ ఏంటి? సూర్యకీ, విజయ్ వర్మకీ రైవల్రీ ఏంటి వంటి విషయాలను ఇప్పుడు రివీల్ చేయదలచుకోలేదు మేకర్స్. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళంలో ఈ సినిమాను రూపొందించనున్నారు. సుధ కొంగర ఇప్పుడు హిందీ సూరరై పోట్రు సినిమాతో బిజీగా ఉన్నారు. అందులో అక్షయ్‌కుమార్ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆమె సూర్య సినిమా మీద కాన్‌సెన్‌ట్రేట్ చేస్తారు.
ఆమె ప్రీ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేయగానే, షూటింగ్ మొదలుపెట్టేస్తారు. నవంబర్ నుంచి షూటింగ్ ఉంటుంది. సూర్య నవంబర్ నుంచి షూటింగ్ పాల్గొంటారు. కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాక దుల్కర్ సన్నివేశాలను తెరకెక్కిస్తారు. సూర్య ప్రస్తుతం కంగువ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా డైరక్ట్ చేసే కర్ణకు కూడా సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
![]() |
![]() |