![]() |
![]() |

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో ఎంతలా సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడదే టైటిల్ తో ఓ మూవీ రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ హీరోగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అన్ స్టాపబుల్'. 'సన్ ఆఫ్ ఇండియా' తర్వాత రత్నబాబు దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.
'అన్ స్టాపబుల్'లో సన్నీతో పాటు సప్తగిరి, నక్షత్ర, బిత్తిరి సత్తి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్.. టైటిల్ కి తగ్గట్లే ఇది నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అని తెలియజేస్తోంది. బంగారం చెప్పురా వంటి సోషల్ మీడియా ట్రోల్స్, ఐపీఎల్ కాస్ట్యూమ్స్, బిత్తిరి సత్తి గెటప్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక కాంతారా తరహా ఎఫెక్ట్ తో టీజర్ ముగించడం ఆకట్టుకుంది.

రంజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి డీఓపీగా వేణుమురళిధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ గా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |