![]() |
![]() |

ప్రయోగాత్మకమైన సినిమాలతో భిన్నమైన కథలతో ఆకట్టుకుంటున్నాడు మలయాళ నటుడు మమ్ముట్టి. వయసుతో సంబంధం లేకుండా భిన్నమైన సినిమాలతో ప్రతీ ఏడాదీ రెండు, మూడు సినిమాలు చేస్తూనే ఉన్నాడు మమ్ముట్టి.
కన్నూర్ స్క్వాడ్, క్రిస్టోఫర్, యాత్ర, భ్రమయుగం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మమ్ముట్టి రీసెంట్ గా ఓ వివాదాస్పద కథతో ముందుకొచ్చాడు. కాథల్- ది కోర్ సినిమాతో అందరికి చర్చనీయాంశంగా మారిన నటుడు 'మమ్ముట్టి'. ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని కువైట్, ఖతర్ దేశాలు బ్యాన్ చేశాయి. హీరోయిన్ గా జ్యోతిక ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయడంతో భారీగా వ్యూయర్ షిప్ వచ్చిందని తెలుస్తోంది. ఇక ఇటీవల ' భ్రమయుగం' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు మమ్ముట్టి. దానికి ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే భ్రమయుగం లాంటి హారర్ థ్రిల్లర్ లో మమ్ముట్డి నటనకి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోంది. ఈ సమయంలోనే మమ్ముట్టి మరో సినిమాకి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఆ సినిమా పేరు 'టర్బో'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెకండ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్ లో మమ్ముట్టి ఓ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు రౌడీల మధ్య కూర్చొని మాస్ లుక్ లో కన్పిస్తున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. వైశాఖ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా.. సునీల్, రాజ్ బి శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి మమ్ముట్టి ఈ సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |