Home  »  News  »  Tollywood trending.. ఈ రోజు టాలీవుడ్ ట్రెండింగ్ లో హెడ్ లైన్స్  

Updated : May 11, 2026

 

 

వీకెండ్ తర్వాత వచ్చే మండే రోజు మీరు డల్ గా ఉంటారేమో, నాకు మాత్రం నో డల్ అంటు తాజా వేడి తెలుగు న్యూస్ మీ కోసం అందుబాటులో ఉన్నాయి. అవేంటో చూద్దాం


1 .రోడ్డు ప్రమాదంలో  హీరో, కెమెరా మెన్  మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ హీరో భరత్ కాంత్ మృతిచెందారు. ఆయన వయసు 31 సంవత్సరాలు. ఈ విషాద ఘటన బొంగులూరు గేట్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తున్నభరత్ కాంత్ కారుని వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ కాంత్‌తో పాటు సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ కూడా చనిపోవడం జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆ ఇద్దరి మృతి పట్ల తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.
 
2 . విశ్వంభర విషయంలో  ట్విస్ట్ ఇచ్చిన దర్శకుడు 

విశ్వంభరని రెండు భాగాలుగా రీలీజ్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లుగా కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఫాంటసీ ప్రపంచం,  విభిన్న లోకాలు, మెగాస్టార్ క్యారక్టర్ లోని షేడ్స్‌ని ఒకే భాగంలో చూపించడం కష్టమని దర్శకుడు వశిష్ట భావిస్తున్నాడని, అందుకే టూ పార్ట్స్ గా రానుందనే న్యూస్ చాలా కాన్ఫిడెన్స్ గానే చక్కర్లు కొడుతూ వస్తుంది. తాజాగా ఈ విషయంపై  వశిష్ట స్పందిస్తు విశ్వంభర రెండు భాగాలుగా రావడం లేదు. అలాంటి  రూమర్స్ ని నమ్మకండి. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. విఎఫ్ఎక్స్ వలన లేటు అవుతూ వస్తుంది. సదరు విఎఫ్ఎక్స్ పనుల్ని చిరంజీవి గారు  స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చాడు.

3 .మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

ప్రధాని మోదీకి మద్దతు తెలిపే రష్మీ, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని   దారుణమైన ఘటనలు, మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి ఎందుకు స్పందించడం లేదంటు కొంత మంది రష్మీని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఎక్స్ వేదికగా రష్మీ  స్పందిస్తు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి  బిజెపి సిద్ధాంతాలకి మద్దతు ఇస్తున్నాను. అది నా వ్యక్తిగత ఇష్టం. మోదీకి మద్దతు ఇవ్వడం అంటే నేరస్థులని,మనిషి రూపంలో ఉన్న మృగాలని, రేపిస్టులని, లైంగిక వేధింపులకి గురి చేసే వారిని    సమర్థించడం కాదు. బూతులతో కూడిన పోస్టులకి నేను స్పందించను. రిప్లై కూడా  ఇవ్వను. ఈ విషయాన్ని పదేపదే చెప్తూ వస్తున్నాను.  సమస్యలపై కేవలం సానుభూతి మాత్రమే చూపగలను. కానీ వాటన్నిటి కోసం పోరాడలేనని రష్మీ చెప్పుకొచ్చింది.

4 . శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో  మోసాలు!

తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోగా కూడా మారాడు తమిళ స్టార్ శివ కార్తికేయన్.  
శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ అనే సంస్థని కూడా నెలకొల్పి నిర్మాణ రంగంలో కూడా ఉన్నాడు. కానీ కొంత మంది శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ అనే పేరుని వాడుకొని పలు మోసాలకి పాల్పడుతున్నారు. ఈ విషయంపై శివ కార్తికేయన్ స్పందిస్తు కొందరు కేటుగాళ్లు మా సంస్థ పేరుని వాడుకొని అమాయక నటీనటులని ఆడిషన్ పేరుతో  మోసం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా మా దృష్టికి వచ్చింది. తమ సంస్థ  నటీనటుల ఎంపిక కోసం డబ్బులు అడగదు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చింది.


5 . సప్తగిరి పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ 


సప్తగిరి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో అన్ని చిన్న సినిమాలే చేశాను. పెద్ద సినిమాలు రాలేదని చెప్పాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఫ్యాన్స్ స్పందిస్తు రాజా సాబ్ ఎలా మర్చిపోతావు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా గొప్పగా కూడా మాట్లాడావు కదా.. మరి రాజా సాబ్ పెద్ద సినిమా కాదా అని మండిపడుతున్నారు.

6 .ప్రేమ ఎప్పుడు గొప్పదే అంటు పోస్ట్ చేసిన త్రిష 

విజయ్ తమిళనాడు సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో, సదరు ఈవెంట్ కి త్రిష హాజరైన విజువల్స్ కూడా అంతే పాపులర్ అయ్యింది . రీసెంట్ గా త్రిష ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. సదరు పోస్ట్ లో 'ప్రేమ ఎప్పుడు గొప్పగానే వ్యక్తమవుతు ఉంటుందని నీలిరంగు హార్ట్ ఎమోజి ని జోడించింది. ఇప్పుడు ఈ ట్వీట్ సినీ,పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.

7 .రంగబలి ఫేమ్ పవన్ దర్శకత్వంలో యోగిబాబు, సత్య హీరోలుగా మూవీ.

నాగ శౌర్య తో రంగబలిని తెరకెక్కించిన దర్శకుడు పవన్ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని యోగిబాబు, సత్యలతో చేయబోతున్నాడు. ఈరోజు పూజా కార్యక్రమంతో  షూటింగ్ ని ప్రారంభించుకుంది. ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ .


8 .నారా రోహిత్,నయన్ సారిక జంటగా కొత్త చిత్రం స్టార్ట్ 
విభిన్న చిత్రాల హీరో నారారోహిత్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టాడు. గోల్డెన్ లెగ్ హీరోయిన్ నయన్ సారిక హీరోయిన్ కావడంతో క్రేజీ ప్రాజెక్ట్ గాను మారింది. ఈ రోజు పూజా కార్యక్రమాలు జరగగా  కొరటాల శివ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన దర్శకుడు మణికుమార్ తెరకెక్కిస్తున్నాడు.

9 . భోగి నుంచి  డింపుల్ హయతి  క్యారక్టర్ రిలీజ్ 

శర్వానంద్ , సంపత్ నంది కాంబోలో భోగి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి మేకర్స్ రీసెంట్ గా డింపుల్ హయతి లుక్ ని రివీల్ చేసారు.  రెడ్ శారీ ధరించి చేతిలో విసన కర్ర పట్టుకొని ఉన్న ఆమె లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచానికి ఆమె సౌందర్యం కావాలి. కానీ ఆమె మనసుని ఎవరు అర్ధం చేసుకోరు అనే క్యాప్షన్ తో డింపుల్ ఎలాంటి క్యారక్టర్ లో చేస్తుందో అర్ధమవుతుంది.

10 . మోడీ పవన్ వైఫ్ అన్నా లెజినోవా ప్రామిస్ 
 మోడీ నిన్నహైదరాబాద్ లోని  పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి పవన్ ని పరామర్శించిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో రీసెంట్ గా పవన్ వైఫ్ అన్నా లెజినోవా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు ప్రధాని మా ఇంటికి రావడం ఏంటో ఆనందంగా ఉంది.ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేను. నా భర్త పవన్ కళ్యాణ్ ని జాగ్రతగా చూసుకుంటానని ప్రధానికి ప్రామిస్ చేసానని తెలియచేసింది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.